SPIRITUALLY HIG TONE CULTURAL PROGRAMS AT SRI PAT BTU _ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Tirupati, 25 November 2019: On day three of the ongoing Karthika brahmotsavams of Sri Padmavati Ammvari Temple at Tiruchanoor, the cultural programs organized by the TTDs HDPP,  Annamacharya Project, Dasa Sahitya Project at the Asthana Mandapam and other venues captivated the devotees.

At the Asthana Mandapam of Tiruchanoor, the team of Smt K Iswaramma of Tirupati rendered Mangala dwani and Sri Sri Sri. Tridandi Devanatha Ramanuja Jeeyar Swamiji presented a religious discourse on the Significance of Vishista Advaitha philosophy in Vedas.

It was followed by a religious discourse by Dr. E A Singacharyulu of Tirupati and later on Bhakti sangeet by Kumari Pratibha and  Soundarya troupe from Hyderabad.

Later Sri Srinivasa Rao bhagavatar rendered Harikatha Parayanam. Kumari 

Shailaja and Soundarya team presented Annamacharya vinnapalu followed by Bhakti sankeertans by Smt Jnana Prasanna of Chennai.

Similarly at Mahati auditorium the Ratnalaya cultural dance college of Bangalore presented a dance program.

Followed by Bhakti sangeet at Annamacharya Kala Mandir by Sri Girish and team of Tirupati.

Later on the troupe of Smt Sravani of Tirupati presented Bhakti sangeet at Ramakrishna Pushkarani.

Lastly, the team of Smt Lakshmi from Tirupati enthralled the audience at the Shilparamam on Tiruchanoor Road with their Bhakti sangeet.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు

తిరుపతి, 2019  న‌వంబ‌రు 25: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో సోమ‌వారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మవారి శోభను మరింత ఇనుమడింప చేశాయి. ఇందులో భాగంగా తిరుచానూరులోని ఆస్థానమండపంలో నిర్వహించిన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఉదయం 5.30 నుండి 6.00 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీమ‌తి కె.ఈశ్వ‌ర‌మ్మ‌ బృందం మంగళధ్వని, ఉద‌యం 6.00 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి దేవ‌నాథ రామానుజ జీయ‌ర్‌స్వామి వేదాల‌లో విశిష్టాద్వైతంపై అనుగ్ర‌హభాష‌ణం చేశారు.

ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు తిరుప‌తికి చెందిన డా.ఇ.ఎ.శింగ‌రాచార్యులు ధార్మికోప‌న్యాసం చేశారు. ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హైద‌రాబాదుకు చెందిన బి.ప్ర‌తిభ మ‌రియు సౌంద‌ర్య‌ బృందం వారిచే  భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.  

అనంత‌రం మధ్యాహ్నం 3.00 నుండి 4.30 గంటల వరకు  తిరుప‌తికి చెందిన శ్రీ‌శ్రీ‌నివాస‌రావు భాగ‌వ‌తార్‌ హరికథ పారాయణం చేశారు. కాగా సాయంత్రం 4.30 నుండి 6.00 గంటల వరకు తిరుప‌తికి చెందిన శైల‌జ మ‌రియు సౌంద‌ర్య బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంట‌ల వ‌ర‌కు  ఊంజల్‌ సేవలో చెన్నైకి చెందిన జ్ఞాన‌ప్ర‌సూన్న బృదం సంకీర్తన‌ల‌ను గానం చేయ‌నున్నారు.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు బెంగుళూరుకు చెందిన ర‌త్నాల‌య సాంస్కృతిక నృత్య క‌ళాశాల వారిచే  నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ గిరిష్‌ బృందం భక్తి సంగీతం, రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద తిరుప‌తికి చెందిన శ్రావ‌ణి బృందంచే భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌న్నున్నారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన వి.ల‌క్ష్మి బృందం సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.