SRI ABHAYA ANUGRAHA SRI VENKATESWARA SWAMY TEMPLE BROUGHT UNDER TTD _ టిటిడి ఆధీనంలోకి శ్రీ అభయ అనుగ్రహ శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆల‌యం

Tirupati, 27 February 2026: The Sri Abhaya Anugraha Sri Venkateswara Swamy Temple located at Thimmajikandriga village in Naidupeta Mandal of Tirupati district was formally taken over by Tirumala Tirupati Devasthanams on Friday.

On this occasion, the temple trustee Sri K. Narasinga Rao, along with the villagers, handed over the temple-related records to the TTD officials. The temple has been brought under the administrative control of the Sri Kapileswara Swamy Temple complex in Tirupati.

TTD Superintendents Sri Gnanaprakash, Sri Muni Kumar, Sri Rajesh, temple officials Sri Mahesh, Sri Ravikumar Reddy and others were present on the occasion.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఆధీనంలోకి శ్రీ అభయ అనుగ్రహ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆల‌యం

తిరుపతి, 2026 ఫిబ్ర‌వ‌రి 27: తిరుప‌తి జిల్లా, నాయుడుపేట మండలం, తిమ్మజికండ్రిగ గ్రామంలోని శ్రీ అభయ అనుగ్రహ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్య‌క్ర‌మం శుక్ర‌వారం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త శ్రీ కే. నరసింగా రావు మరియు గ్రామస్థులు ఆల‌యానికి సంబంధించిన  రికార్డుల‌ను టీటీడీ అధికారులకు అందించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆల‌య స‌ముదాయంలో ఈ ఆల‌యాన్ని చేర్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి   సూప‌రింటెండెంట్లు శ్రీ జ్ఞానప్రకాష్, శ్రీ ముని కుమార్, శ్రీ రాజేష్, ఆలయ అధికారులు శ్రీ మహేష్, శ్రీ రవికుమార్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.