SRI BASHYAKARULA SATTUMORA ON APRIL 18 _ ఏప్రిల్ 18న శ్రీ భాష్యకారుల సాత్తుమొర
Tirumala, 15 April 2021: As part of the ongoing Bhashyakarula Utsavam at Srivari temple from April 9 to 27, the unique tradition of Sattumora will be observed on April 18 on the advent of Arudra Nakshatram in the holy Vaisakha month which happens to be the birth star of Sri Ramanuja.
Visesha Samarpana will be conducted to the utsava idols of Sri Malayappa and His consorts Sri Sridevi and Sri Bhudevi at Vaibhavotsava Mandapam in the evening.
After the Sahasra Deepalankara seva they would be taken in a procession on a Tiruchi along four Mada streets.
Thereafter a pradakshina is performed within the vimana prakaram.
At night the Sattumora tradition is observed at the Bashyakarula Sannidhi and offered special ornaments.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 18న శ్రీ భాష్యకారుల సాత్తుమొర
తిరుమల, 2021 ఏప్రిల్ 15: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9 నుండి 27వ తేదీ వరకు జరుగుతున్న భాష్యకారుల ఉత్సవంలో భాగంగా ఏప్రిల్ 18న సాత్తుమొర జరుగనుంది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సాత్తుమొర నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ భాష్యకార్లవారికి విశేష సమర్పణ చేస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీ భాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.