DIVINE KALYANAM HELD _ శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా దక్షిణామూర్తి హోమం
TIRUPATI, 27 OCTOBER 2025: The celestial Kalyanam of Sri Valli Devasena sameta Sri Subramanya Swamy was observed in Sri Kapileswara Swamy temple in a grand manner on Monday evening.
Earlier in the morning, Dakshinamurty Homam was observed while on Tuesday, Navagraha Homam will be performed.
Temple officials and devotees were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా దక్షిణామూర్తి హోమం
– వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యకల్యాణం
తిరుపతి, 2025 అక్టోబరు 27: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా సోమవారం దక్షిణామూర్తి హోమం శాస్త్రోక్తంగా జరిగింది.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 నుండి 11 గంటల వరకు దక్షిణామూర్తి హోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, దక్షిణామూర్తి కలశాభిషేకం నిర్వహించారు.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యకల్యాణం
సాయంత్రం 5.30 గంటలకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.
అక్టోబరు 28న శ్రీ నవగ్రహ హోమం
అక్టోబరు 28న శ్రీ నవగ్రహ హోమం హోమం జరుగనుంది. గృహస్తులు రూ. 500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.












