SRI DHANWANTARI PUJA HELD AT VASANTHA MANDAPAM _ వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా శ్రీధ‌న్వంత‌రి పూజ

Tirumala, 21 November 2022:As part of the ongoing Karthika Masa Vishnu puja Mahotsavam, on Monday morning TTD organised Sri Dhanwantari  Puja at Vasantha Mandapam in Tirumala which was telecasted live by SVBC.

Earlier the utsava idols of Srivaru with His consorts were seated along with Sri Dhanwantari at  Vasanta Mandapam. TTD’s Vaikhanasa Agama advisor Sri NV Mohana Rangacharyulu highlighted the significance of the Dhanwantari puja to alleviate all ills of society besides ensuring good health and prosperity.

The celestial puja began with Sankalpam, Dhanvanthri Astottarasata Namavali, Dhanwantari  Mantra Parayanams, Nivedana, Harati, Kshama Prarthana and Mangalam.

Vedic pundits of Dharmagiri and TTD officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా శ్రీధ‌న్వంత‌రి పూజ

తిరుమల‌, 2022 నవంబరు 21: కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా సోమవారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో శ్రీ ధ‌న్వంత‌రి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ శ్రీ‌నివాసుడు, వారికి అభిముఖంగా శ్రీ ధ‌న్వంత‌రి స్వామివారిని వ‌సంత మండ‌పంలో వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ ఎన్వీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ క్షీర‌సాగ‌ర మ‌థ‌నంలో చివ‌రిగా శంఖు చక్రా‌లు, అమృత క‌ళ‌శంతో ఉద్భ‌వించిన ధ‌న్వంత‌రి స్వామివారు ఆయుర్వేద విద్య‌కు ప్ర‌సిద్ధి అని, శ్రీ మ‌హావిష్ణువు అవ‌తార‌మ‌న్నారు. ధన్వంతరి పూజ వ‌ల్ల ప్రాణి కోటికి హాని క‌లిగించేవి న‌శించి, సంపూర్ణ‌ ఆరోగ్యం, శాంతి సౌభాగ్యాలు చేకూరుతాయని వివ‌రించారు.

ముందుగా విష్ణుపూజా సంక‌ల్పం చేసి ప్రార్థ‌నాసూక్తం, సంకల్పం చేశారు. ఆ త‌రువాత శ్రీ ధ‌న్వంత‌రి అష్టోత్తర శతనామావళి, ధన్వంతరి మంత్ర పారాయణం నివేద‌న‌, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమాప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.

ఈ కార్య‌క్ర‌మంలో ధర్మగిరి వేద పాఠశాల పండితులు, అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.