SRI GOVINDA TAKES RIDE ON SARVABHUPALA VAHANAM _ సర్వభూపాల వాహనంపై శ్రీ గోవిందుడు

TIRUPATI, 05 JUNE 2025: Sri Govindaraja Swamy took out a celestial ride on the Sarva Bhupala Vahanam in Tirupati on Thursday evening.

Both the senior and junior pontiffs of Tirumala, DyEO Smt Shanti and other staff, devotees were present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

సర్వభూపాల వాహనంపై శ్రీ గోవిందుడు

తిరుపతి, 2025, జూన్ 05: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం రాత్రి స్వామి వారు సర్వభూపాల వాహనంపై భక్తులను కటాక్షించారు.

రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

సర్వభూపాల వాహ‌నం – య‌శోప్రాప్తి :

సర్వభూపాల అంటే రాజులందరు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు.
వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల‌ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఎఫ్ ఏ అండ్ సిఏవో శ్రీ ఓ.బాలాజీ, డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, ఏవీఎస్వో శ్రీ మోహన్ రెడ్డి, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.