SRI GOVINDARAJA SWAMY POURNAMI GARUDA SEVA HELD GRANDLY _ వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడసేవ
Tirupati, July 29, 2026: The monthly Pournami Garuda Seva was celebrated with great religious fervour at the Sri Govindaraja Swamy Temple in Tirupati on Wednesday.
As part of the monthly tradition, Sri Govindaraja Swamy was taken in a grand procession on His beloved Garuda Vahanam through the four Mada Streets of the temple from 6 pm to 8 pm, blessing devotees.
Temple Deputy EO V. R. Shanthi, AEO A.B. Narayana Chowdary, Superintendent Chiranjeevi, Temple Inspector Dhananjaya and a large number of devotees participated in the event.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
- oplus_32
- oplus_0
- oplus_2097152
వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడసేవ
తిరుపతి, 2026 జూలై 29: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.
ప్రతి పౌర్ణమినాడు ఆలయంలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల నడుమ శ్రీగోవిందరాజస్వామివారు తన ప్రియభక్తుడైన గరుడునిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయ, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



