SRI GT GARUDA SEVA _ గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి కటాక్షం

Tirupati, 21 July 2024: Garuda Vahana Seva was held in connection with Guru Pournami on Sunday in Sri Govindaraja Swamy temple in Tirupati on Sunday evening.
Sri Govindaraja Swamy in all His religious splendour on Garuda Vahanam, paraded along the temple streets to bless the devotees.
Temple Deputy EO Smt Shanti and others participated.
 
ISSUED BY CPRO TTD TIRUPATI

గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి కటాక్షం

 తిరుపతి, 2024 జూలై 21 ; తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. స్వామివారు గరుడునిపై మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

వాహన సేవలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ మునికృష్ణారెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ నారాయణ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.