SRI HANUMAN JAYANTI CELEBRATIONS BY TTD _ టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు

Tirupati, 21 May 2025: Sri Hanuman Jayanti celebrations will be organized on May 22 at 160 temples across the twin Telugu states under the auspices of the Hindu Dharma Prachara Parishad(HDPP) wing of TTD.

These celebrations will take place at 79 temples in Andhra Pradesh and 81 temples in Telangana.

As part of the festivities, the temples will conduct Abhishekam, Aku puja, devotional bhajans, and spiritual discourses dedicated to Lord Hanuman. 

These celebrations are being held as part of the “Mana Gudi” program.

The Hindu Dharma Prachara Parishad has been organizing special pujas during major Hindu festivals as part of the “Mana Gudi” initiative. 

It may be mentioned here that on April 6, on the auspicious occasion of Sri Rama Navami, the “Mana Gudi” program was successfully conducted in 315 Bhajana Mandirams located in the backward and fishermen communities.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు

తిరుపతి, 2025, మే 21: టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మే 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 160 దేవాలయాల్లో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు జరుగనున్నాయి. ఏపీలోని 79, తెలంగాణలోని 81 దేవాలయాలలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా స్వామి వారికి అభిషేకము, ఆకుపూజ , భజనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగనున్నాయి. సదరు ఆలయాలలో ” మనగుడి” కార్యక్రమంలో భాగంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తారు.

“మన గుడి” కార్యక్రమంలో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ విశేష పర్వ రోజులలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామ నవమి పండుగ సందర్భంగా దళిత, గిరిజన, మత్స్యకార ప్రాంతాల్లో నిర్మించిన 315 భజన మందిరాలలో మన గుడి కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం విదితమే.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.