SRI KALYANA VENKATESWARA GRACES ON MUTHYAPU PANDIRI _ ముత్య‌పుపందిరి వాహనంపై కాళీయ మర్ధనుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి

Tirupati, 20 February 2025: On the third evening of the ongoing annual Brahmotsavam at  Srinivasa Mangapuram Sri Kalyana Venkateswara Swamy, on Thursday along, Sridevi and Bhudevi appeared to devotees in Kaliya Mardhana Alankaram.

In Vahana Seva, spl. Gr.Deputy EO of the Temple, Smt. Varalakshmi, AEO, Sri. Gopinath, Vaikhanasa Agama advisor, Sri. Mohana Rangacharyulu, other officials and a large number of devotees participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముత్య‌పుపందిరి వాహనంపై కాళీయ మర్ధనుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి

తిరుపతి, 2025 ఫిబ్రవరి 20: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీనివాసుడు కాళీయ మర్ధనుడి అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

రాత్రి 7 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

వాహ‌న‌సేవ‌లో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌, శ్రీ ధ‌న శేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.