SRI KAPILESWARA SHINES ON SURYAPRABHA _ సూర్యప్రభ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి క‌టాక్షం

TIRUPATI, 09 FEBRUARY 2026: On the second day of  Brahmotsavam at Kapila Theertham, Sri Kapileswara Swamy shined atop Surya Prabha Vahanam and blessed His devotees on the bright Sunny Monday.

The Vahana Seva took place in the streets amidst the colourful performance by devotional dance troupes.

After that, Tirumanjanam was solemnly dedicated to Sri Somaskandamurthy and Sri Kamakshi Devi.  

Temple Superintendent Chandrasekhar, temple priests and other officials, the devotees participated in the vahana seva.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

సూర్యప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామివారి క‌టాక్షం

తిరుప‌తి, 2026 ఫిబ్రవరి 09: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ రోజైన సోమ‌వారం ఉదయం 7 గంట‌ల‌కు శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై క‌టాక్షించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

చీకటిని ఛేదించి లోకానికి వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడు. సూర్యుని ప్రభ లోకబంధువైన కోటిసూర్యప్రభామూర్తి శివదేవునికి వాహనమైంది. మయామోహాందకారాన్ని తొలగించే సోమస్కందమూర్తి, భక్తులకు సంసారతాపాన్ని తొలగిస్తున్నారు.

అనంతరం శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.

వాహ‌న‌సేవ‌లో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది