SRI KAPILESWARA SWAMY BLESSES DEVOTEES IN CHANDRAPRABAHA _ చందప్రభ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామి వారి క‌టాక్షం

Tirupati, 20 February 2025: On the second evening of Sri Kapileswara Swamy temple annual fete, on , the chief deity took out a celestial ride on Chandraprabha Vahanam.

The vahanam signifies that moon, which has a unique place in the constellation, brings happiness to the minds of millions of living beings.  

Temple Deputy EO Sri Devendra Babu, AEO Sri Subbaraju, Superintendent Shri Chandrasekhar, temple priests, other officials and especially devotees participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చందప్రభ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామి వారి క‌టాక్షం

తిరుపతి, 2025 ఫిబ్రవరి 20: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ రోజైన గురువారం రాత్రి శ్రీ కపిలేశ్వర స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను క‌టాక్షించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

శివుడు అష్టమూర్తి స్వరూపుడు. సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, అగ్ని, వాయువు ఆకాశం, యజమానుడు శివుడి ప్రత్యక్షమూర్తులు. చంద్రుడు అమృతమూర్తి. వెన్నెల కురిపించి జీవకోటి మనస్సులకు ఆనందాన్ని కలిగించే షోడశకళాప్రపూర్ణుడు. శివభగవానుడు విభూతి సౌందర్యంతో ధవళతేజస్సుతో వెలుగొందుతూ తన కరుణ కిరణాలతో అమృత శీతలకాంతులను జీవులకు అనుగ్రహిస్తాడు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.