SRI KAPILESWARA SWAMY TEMPLE GETS HOLY CLEANSING FOR ANNUAL BRAHMOTSAVAMS _ శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, 12 Feb. 20: The unique ritual of Koil Alwar Tirumanjanam (cleansing the premises) was held at the TTD local temple, Sri Kapileswara Swamy Temple on Wednesday morning ahead of annual Brahmotsavams from February 14-23.
Ankurarpanam for the nine-day festival will be held on February 13th evening.
The temple was closed in the morning after rituals and Abhisekam. The archakas and officials participated in the cleaning of the sanctum, dwajastambham sub-temples and surroundings with eco friendly, herbals and detergents.
DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupathi, inspectors Sri Reddy Sekhar and Srinivas Naik and others participated.
BRAHMOTSAVAMS PREPARATIONS AND SCHEDULE
TTD has made all arrangements for the grand conduction of the Brahmotsavams with barricades, drinking water outlets colourful rangolis, flower and electrical decorations for the celebrations.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2020 ఫిబ్రవరి 12: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం కోయిల్ ఆళ్వార్ తిరుంజనం ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 14 నుండి 23వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టరు శ్రీ రెడ్డిశేఖర్, శ్రీనివాసనాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 13న శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతిలోని శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 14 నుండి 23వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో అంకురార్పణ కార్యక్రమం ఫిబ్రవరి 13న గురువారం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు మూషిక వాహనంపై శ్రీవినాయకస్వామివారి వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు అంకురార్పణ జరుగనుంది.
ఏర్పాట్లు పూర్తి :
బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
ఫిబ్రవరి 14న ధ్వజారోహణం :
ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం ఉదయం 8.04 గంటలకు కుంభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు పల్లకి ఉత్సవం, రాత్రి 7.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
14-02-2020(శుక్రవారం) ధ్వజారోహణం(కుంభలగ్నం) హంస వాహనం
15-02-2020(శనివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
16-02-2020(ఆదివారం) భూత వాహనం సింహ వాహనం
17-02-2020(సోమవారం) మకర వాహనం శేష వాహనం
18-02-2020(మంగళవారం) తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం
19-02-2020(బుధవారం) వ్యాఘ్ర వాహనం గజ వాహనం
20-02-2020(గురువారం) కల్పవృక్ష వాహనం అశ్వవాహనం
21-02-2020(శుక్రవారం) రథోత్సవం(భోగితేరు) నందివాహనం
22-02-2020(శనివారం) పురుషామృగవాహనం కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం
23-02-2020(ఆదివారం) శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,
సూర్యప్రభ వాహనం, త్రిశుల స్నానం. ధ్వజావరోహణం.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.