SRI KRISHNA JANMASHTAMI ASTHANAM ON AUGUST 30 AND UTLOTSAVAM IN EKANTAM ON AUGUST 31 _ తిరుమలలో ఆగస్టు 30న గోకులాష్టమి ఆస్థానం, 31న ఉట్లోత్సవం
TIRUMALA, 28 AUGUST 2021: The Sri Krishna Janmashtami Asthanam will be observed in Tirumala on August 30 in the Srivari temple in adherence to Covid guidelines.
As a part of this festival, Ekanta Tirumanjanam will be rendered to the deities of Sri Ugra Sreenivasamurthy, Sridevi, Bhudevi and Sri Krishna Swamy followed by Asthanam between 7pm and 8pm.
Meanwhile, at Gogarbham Gardens, special Abhishekam to Sri Kaliyamardana Krishna will be observed between 11am and 12noon in Ekantam by the Garden wing of TTD.
On August 31, the Utlotsavam fete will also be observed in Ekantam at Ranganayakula Mandapam inside Srivari temple between 4pm and 5pm due to the Covid pandemic. TTD has cancelled virtual arjita sevas including Arjita Brahmotsavam and Sahasra Deepalankara Seva in connection with Utlotsavam.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో ఆగస్టు 30న గోకులాష్టమి ఆస్థానం, 31న ఉట్లోత్సవం
తిరుమల, 2021 ఆగస్టు 28: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 30వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.
శ్రీవారి ఆలయంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు.
అదేవిధంగా ఆగస్టు 31న తిరుమలలో ఉట్లోత్సవాన్ని పురస్కరించకుని సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీమలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై ఆలయంలోని రంగనాయకుల మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహిస్తారు.
కాగా, ప్రతి ఏడాది తిరుమలలో ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారు తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ హారతులు స్వీకరిస్తారు. యువకులు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ ఉట్లోత్సవంలో పాల్గొంటారు. కానీ కోవిడ్ – 19 నిబంధనల మేరకు తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి, ఉట్లోత్సవాలను శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది ఏకాంతంగా టీటీడీ నిర్వహించనుంది.
ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 31న శ్రీవారి ఆలయంలో నిర్వహించే వర్చువల్ సేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.