SRI KRISHNA LEELA CAPTIVATES DEVOTEES _ బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు
Tirupati, 24 September 2023:The students of TTD run Sri Venkateswara College of Music and Dance of Tirupati performed an amazing episode of Srikrishna Leela under the choreography of Sri Sunil Kumar on Sunday evening before Chandraprabha Vahanam.
A total of 11 groups comprising 266 artists from AP, TN, TS, Karnataka, UP, and Odisha participated and entertained the devotees by performing their art forms with finesse.
In Tirupati
The devotional music, dance, and Harikatha Parayanam at various platforms in Tirupati also enthralled the denizens.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు
తిరుమల, 2023 సెప్టెంబరు 24 ;శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం తిరుమల, తిరుపతిలోని పలు వేదికలపై టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
తిరుమలలోని ఆస్థానమండపంలో ఉదయం వేద సందేశం, శ్రీ పార్థసారథి బృందం విష్ణుసహస్రనామపారాయణం, గుంటూరుకు చెందిన శ్రీమతి ఎ.భారతీదేవి బృందం భక్తి సంగీతం, శ్రీ దీవి హయగ్రీవాచార్య భక్తామృతం ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం శ్రీమతి ఆర్.బుల్లమ్మ బృందం అన్నమయ్య విన్నపాలు, శ్రీ రమేష్‌బాబు బృందం హరికథా పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు.
తిరుపతి మహతి కళాక్షేత్రంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల ‘నాదనీరాజన’ కార్యక్రమం సభను రక్తి కట్టించింది. అన్నమాచార్య సంకీర్తలైన -హరియవతారమీతడు అన్నమయ్య…, భావములోన…., ఎంతమాత్రమున….., పరమపురుష నిరుపమాన… తదితర కీర్తనలను గాయకులు కె.సరస్వతిప్రసాద్ తెలియజేయగా, వయోలిన్ ద్వారా జి.చక్రపాణి, కె.శంకర్, కీబోర్డుపై డి.కె.భరద్వాజ, మృదంగంపై పి.బాలసుబ్రహ్మణ్యం, తబలాపై పి.పాండురంగారావు, డోలుపై టి.మురళి, కంజీరపై పి ఎన్ వి మురళీకృష్ణ, మోర్సింగ్ పై ఎస్.వేణుగోపాల్, శృతి-రిథమ్ పై పి.సురేష్ లయబద్ధంగా వాయించారు.
తిరుపతి రామచంద్రపుష్కరిణి వేదికపై హిందూధర్మప్రచార పరిషత్ కు చెందిన కొండపల్లి ఉదయకుమార్ బృందం మహాభారతంలోని ‘ఉత్తరాభిమన్యుల కల్యాణం’ బుర్రకథను జయ జయ వినాయక అన్న గణేశ ప్రార్థనతో ప్రారంభించి వీనులవిందుగా వినిపించారు. వీరికి ఎం.రాఘవేంద్రబాబు వాచకం చేయగా, వై.ఉపేంద్ర హాస్య , ఆహార్యంపై వీరేశ్వర్ సహకరించారు.
అన్నమాచార్య కళామందిరంలో శ్రీమతి జ్ఞానప్రసూన, శ్రీహరనాథ్ బృదం చక్కటి సంగీత కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాలు హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య సూరం శ్రీనివాసులుగారి పర్యవేక్షణలో జరిగాయి. ఇందులో టీటీడీ ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.