SRI KV MURALIKRISHNA ASSUMES CHARGE AS TTD CV&SO _ టీటీడీ సీవీఎస్వోగా శ్రీ కే.వీ.మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరణ

Tirumala, 05 June 2025: Sri K.V. Muralikrishna assumed charge as the Chief Vigilance and Security Officer (CV&SO) of TTD at the Sri Venkateswara Swamy Temple in Tirumala on Thursday.

Before taking charge, the CV&SO had darshan of Sri Venkateswara Swamy and then formally took charge at the Ranganayakula Mandapam. The temple officials presented him with Tirtha Prasadams.

TTD Additional CV&SO Sri Venkata Shivakumar Reddy, Vigilance Officers Sri Ram Kumar, Sri Surendra, and other officials participated in the program.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

టీటీడీ సీవీఎస్వోగా శ్రీ కే.వీ.మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరణ

తిరుమల, 2025 జూన్ 05: టీటీడీ ముఖ్య నిఘా మరియు భద్రతాధికారిగా శ్రీ కే.వీ.మురళీకృష్ణ గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.

ముందుగా శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీవీఎస్వో రంగనాయకులు మండపంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆల‌య అధికారులు సీవీఎస్వోకు తీర్థ ప్రసాదాలను అందించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు సీవీఎస్వో శ్రీ వెంకట శివకుమార్ రెడ్డి, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.