SRI LAKSHMI SRINIVASA MAHA DHANWANTARI YAGAM IN TIRUMALA _ ఏప్రిల్ 4 నుండి 6వ తేదీ వరకు తిరుమలలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస మహా ధన్వంతరీ యాగం
TIRUMALA, 01 APRIL 2022: The three day Sri Lakshmi Srinivasa Maha Dhanwantari Yagam will be observed by TTD in Tirumala from April 4-6 with Ankurarpanam on April 3 under the aegis of Dharmagiri Veda Vignana Peetham.
The chief motto of this yagam is seeking divine blessings to save the humanity from dreadful viruses and diseases.
Every day the Yagashala rituals will be telecasted live on SVBC between 11am and 12noon during these three days for the sake of global devotees.
The principal of the Peetham Sri Kuppa Siva Subramanya Avadhani is supervising the arrangements.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 4 నుండి 6వ తేదీ వరకు తిరుమలలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస మహా ధన్వంతరీ యాగం
తిరుమల, 2022 ఏప్రిల్ 01: తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 4 నుండి 6వ తేదీ వరకు మూడు రోజులపాటు టిటిడి శ్రీ లక్ష్మీ శ్రీనివాస మహా ధన్వంతరీయాగం నిర్వహించనున్నారు. ఈ యాగానికి ఏప్రిల్ 3వ తేదీ రాత్రి 7 నుండి 8 గంటల మధ్య అంకురార్పణ నిర్వహించనున్నారు.
శ్రీవారి అనుగ్రహంతో శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ప్రపంచంలోని ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ఉండాలని మూడు రోజుల పాటు యాగం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఎస్వీబిసిలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.