SRI MAHALAKSHMI DEEPA PUJA AT CHANDRAGIRI ON JULY 10 _ జూలై 10న చంద్రగిరిలో వైభవంగా శ్రీ మహాలక్ష్మీ దీప పూజ

TTD MAKES ELABORATE ARRANGEMENTS FOR DEVOTEES: JEO DR. A.SHARATH

Tirupati, July 9, 2026: The Sri Mahalakshmi Deepa Puja will be held grandly at 6 pm on Friday, July 10, at the Sri Kodandarama Swamy Temple premises, Chandragiri.

TTD JEO Dr. A. Sharath reviewed the arrangements on Thursday and directed officials to ensure smooth conduct of the event with coordinated efforts by all departments.

TTD has arranged spacious sheds, mats, Deepa Puja materials, Annaprasadam counters, drinking water, LED screens, temporary toilets and sanitation facilities for the convenience of devotees. The temple premises have also been decorated with special lighting and floral arrangements.

The spiritual event will be telecast live on SVBC.

Deputy EO Smt. Nagaratna, VGO Sri Giridhar, DE Smt. Saraswathi, officials of various departments and SVBC participated in the inspection.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

జూలై 10 చంద్రగిరిలో  వైభవంగా శ్రీ మహాలక్ష్మీ దీప పూజ

భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లుటిటిడి జేఈవో డా. . శరత్

సాయంత్రం 6 గంటలకు ప్రారంభంఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం

తిరుపతి, 2026 జూలై 09: చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రాంగణంలో జూలై 10వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మీ దీప పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవం గా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టిటిడి జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు.

గురువారం ఆలయ ప్రాంగణంలో అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, దీపపూజలో పాల్గొనే వేలాది మంది భక్తుల కోసం విశాలమైన షెడ్లు, మ్యాట్లు, దీపారాధన సామగ్రి, అన్నప్రసాద పంపిణీ కేంద్రాలు, తాగునీటి సౌకర్యం, ఎల్‌ఈడీ స్క్రీన్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణకు అదనపు సిబ్బంది తదితర సౌకర్యాలను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.

అలాగే టీటీడీ ఎలక్ట్రికల్, గార్డెన్ విభాగాలు ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలు, సుందర పుష్పాలంకరణలతో దివ్యంగా అలంకరించాలని, భక్తుల్లో ఆధ్యాత్మిక భావనలను మరింతగా పెంపొందించేలా పవిత్ర వాతావరణాన్ని సృష్టించాలని సూచించారు.

ఈ మహోత్సవాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు జేఈవో తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, విజీవో శ్రీ గిరిధర్, డీఈ శ్రీమతి సరస్వతి, పలు శాఖల అధికారులు, ఎస్వీబీసీ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది