SRI PADMAVATHI AMMAVARI BRAHMOTSAVAMS CELEBRATED GRANDLY IN CHENNAI _ చెన్నైలో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

Tirupati, 09 February 2026: Goddess Sri Padmavathi Ammavaru Graces Devotees on Simha Vahanam

The annual Brahmotsavams of Sri Padmavathi Ammavaru are being celebrated in a grand manner at the Sri Padmavathi Ammavari Temple in Chennai, Tamil Nadu. 

The Brahmotsavams are scheduled to be held from February 7 to February 16, 2026.

As part of the Brahmotsavams, on Monday morning (February 9), Goddess Sri Padmavathi Ammavaru graced the devotees by giving darshan on Mutyapu Pandiri Vahanam. In the night, the Goddess will bless devotees while riding the Simha Vahanam.

Every day during the Brahmotsavams, Sri Padmavathi Ammavaru will bless devotees by giving darshan on different vahanams at 9.00 am and 7.00 pm.

Vahanam Schedule

February 10:

Morning – Kalpavriksha Vahanam

Night – Hanumantha Vahanam

February 11:

Morning – Pallaki Utsavam

Night – Gaja Vahanam

February 12:

Morning – Sarvabhoopala Vahanam

Night – Garuda Vahanam

February 13:

Morning – Surya Prabha Vahanam

Night – Chandra Prabha Vahanam

February 14:

Morning at 8.30 am – Rathotsavam

Night – Ashwa Vahanam

February 15:

Morning at 11.00 am – Chakra Snanam

Night at 7.30 pm – Dhwajavarohanam

February 16:

Evening at 6.00 pm – Pushpayagam

Several cultural programmes will also be organised as part of the Brahmotsavams.

AE0 Sri Dhananjaya, Superintendent Smt. Pushpalatha, temple priests, devotees and other officials participated in the event.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

చెన్నైలో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

సింహ వాహనంపై విహరించిన శ్రీ పద్మావతీ అమ్మవారు

తిరుపతి, 2026 ఫిబ్రవరి 09: తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 07వ తేదీ నుండి 16వ తేదీ వరకు చెన్నైలో శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాలలో సోమవారం (09వ తేదీ) ఉదయం శ్రీ పద్మావతీ అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై విహరించి భక్తులకు అనుగ్రహించారు. రాత్రి సింహ వాహనంపై విహరిస్తారు.

శ్రీ పద్మావతీ అమ్మవారు ఉదయం 09. గం.లకు రాత్రి 07 గం.లకు పలు వాహనాలపై విహరించి భక్తులకు అనుగ్రహించనున్నారు.

వాహన సేవల వివరాలు

ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం

ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం  పల్లకీ ఉత్సవం, రాత్రి  గజ వాహనం

ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి గరుడ వాహనం

ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం సూర్య ప్రభ వాహనం, రాత్రి చంద్ర ప్రభ వాహనం

ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 8.30 గం.లకు రథోత్సవం, రాత్రి అశ్వవాహనం

ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 11 గం.లకు చక్ర స్నానం, రాత్రి 7.30 ధ్వజావరోహణం

ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 06 గం.లకు పుష్పయాగం జరుగనుంది.

బ్రహ్మోత్సవాలలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ధనంజయ, సూపరింటెండెంట్ శ్రీమతి పుష్పలత, అర్చకులు, భక్తులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది