SRI PADMAVATHI AMMAVARI VASANTHOTSAVAMS CONCLUDE GRANDLY _ వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

Tirupati, May 02, 2026: The three-day annual Vasanthotsavams of Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, concluded on Saturday in a grand manner.

On the final day, Suprabhatam and Sahasranamarchana were performed in the morning. The utsava deities were then taken in a procession to the Shukravarapu Thota. Snapana Thirumanjanam was conducted between 2:30 PM and 4:30 PM with sacred substances including turmeric, milk, curd, honey, sandalwood, and fruit juices.

In the evening, the deity was taken in a procession along the four Mada streets, blessing devotees. The festival concluded with Maha Poornahuti.

Temple officials, archakas, and a large number of devotees participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

తిరుపతి, 2026 మే 02: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి.

చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు.

రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మ‌వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. ఆ తరువాత మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహ‌రీంద్ర‌నాథ్‌, ఏఈవో శ్రీ దేవ‌రాజులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్లు శ్రీ సురేష్, శ్రీ ముని చెంగ‌ల్రాయులు, శ్రీ ర‌మేష్‌ టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ చ‌ల‌ప‌తి, పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.