SRI PADMAVATHI DEVI BLESSES DEVOTEES ON SAPTA VAHANAMS _ స‌ప్త వాహనల్లో సిరులతల్లి అభయం

Tirupati, 25 January 2026: The annual Ratha Saptami festival was celebrated with grandeur on Sunday at Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor.

Devotees were delighted to witness the divine rays. of the Sun falling upon the Goddess of Riches, seated majestically on the Suryaprabha Vahanam in the morning.

The festivities commenced at 7 a.m. with the Goddess blessing devotees on Suryaprabha Vahana and continued till 2 p.m, during which She graced Hamsa, Ashwa, Garuda, and Chinna Sesha Vahanams, enchanting devotees with Her divine presence.
 
From 3:30 p.m. to 4:30 p.m., Snapana Tirumanjanam was performed in a ceremonial manner.
 
Later in the evening, from 6:00 p.m. onwards, the Goddess will bless devotees on the Chandraprabha and Gaja Vahanas.
 
At Sri Suryanarayana Swamy Temple, Ashwa Vahana was observed in the morning in connection with Surya Jayanti.
 
On this occasion, cultural programmes such as Kolatas and Chekka Bhajans presented by teams from the TTD Hindu Dharma Prachara Parishad, Dasa Sahitya Project, and SV College of Music and Dance captivated the devotees.
 
Temple DyEO Sri Harindranath, other temple officials, and a large number of devotees participated in the event.
 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

 

స‌ప్త వాహనల్లో సిరులతల్లి అభయం
 
తిరుపతి, 2026 జనవరి 25;   తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ఆదివారం రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
 
ఉదయం భానుని రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మ‌వారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనందపరవశులయ్యారు.
 
ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
 
సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అమ్మవారిని విశేషంగా అభిషేకించారు. సాయంత్రం 6 గంటల నుండి అమ్మవారు చంద్రప్రభ, గజ వాహనంపై దర్శనమివ్వనున్నారు.
 
శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయంలో
 
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీసూర్యనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు.
 
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచారపరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల బృందాల కోలాటాలు, చెక్కభజనలు, భక్తులను ఆకట్టుకున్నాయి.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరింద్ర నాథ్, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.