SRI PARTHASARATHI SWAMY TAKES RIDE _ తెప్పపై శ్రీ పార్థసారథిస్వామివారి కటాక్షం
Tirupati, Feb 7, 2025: On the second day of the ongoing annual Sri Govindaraja Swamy Theppottsavam, on Friday evening, Sri Rukmini and Satyabhama, along with Sri Parthasarathi Swamy, graced the devotees on the colourfully decorated float in the swami Pushkarani.
On the second day, Friday, from 6.30 pm to 8 pm, the decorated with flowers and electronic lights the float of the Lord, along with his consorts performed five laps and offered blessings to the devotees.
Later, he took a procession through the four Mada streets of the temple and blessed the devotees.
Similarly, on Saturday Sri Kalyana Venkateswara Swamy will bless the devotees on the float.
On this occasion, bhajans, Harikatha and cultural programs were organized under the auspices of the TTD Hindu Dharma Prachara Parishad and Annamacharya Project.
Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, temple Deputy EO Smt. Shanti, other officials and a large number of devotees were present
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తెప్పపై శ్రీ పార్థసారథిస్వామివారి కటాక్షం
తిరుపతి, 2025 ఫిబ్రవరి 07: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం సాయంత్రం శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
రెండవ రోజైన శుక్రవారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై ఐదు చుట్లు విహరించి భక్తులకు అభయమిచ్చారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
అదేవిధంగా శనివారం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.