SRI PRASANNA VENKATESWARA SWAMY BLESSES DEVOTEES IN MOHINI AVATAR ON PALLAKI _ మోహినీ అవతారంలో పల్లకిపై దివ్య విహారం
Tirupati, June 29, 2026: As part of the annual Brahmotsavams at Appalayagunta, Sri Prasanna Venkateswara Swamy blessed devotees in the divine Mohini Avatar on the Pallaki Vahanam on Monday morning.
Thousands of devotees had darshan of the Lord, offering camphor harathi and chanting “Govinda” throughout the procession.
Snapana Tirumanjanam was performed from 10.00 am to 11.30 am, while Unjal Seva will be held from 5.30 pm to 6.30 pm.
The grand Garuda Vahanam, the highlight of the Brahmotsavams, will take place at 7.30 pm.
Deputy EO Sri Harindranath, AEO Sri Devarajulu, Superintendent Smt. Srivani, Temple Inspector Sri Venugopal, priests, Srivari Sevaks and a large number of devotees participated in the festivities.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
మోహినీ అవతారంలో పల్లకిపై దివ్య విహారం
భక్తులను అనుగ్రహించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
తిరుపతి, 2026 జూన్ 29: అప్పలాయగుంటలో వైభవంగా జరుగుతున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో పల్లకిపై విహరిస్తూ భక్తులకు దివ్య మంగళ దర్శనం ప్రసాదించారు.
స్వామివారి మనోహర రూపాన్ని దర్శించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
గోవింద నామస్మరణతో మారుమోగిన మాడవీధులు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పల్లకీ వాహనసేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ, గోవింద నామస్మరణల మధ్య స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
వైభవంగా స్నపన తిరుమంజనం – సాయంత్రం ఊంజల్ సేవ
అనంతరం ఉదయం 10.00 నుంచి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఊంజల్ సేవ జరగనుంది.
సాయంత్రం గరుడ వాహనసేవ
రాత్రి 7.30 గంటలకు బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.






