SRI PRASANNA VENKATESWARA SWAMY BLESSES DEVOTEES ON CHANDRAPRABHA VAHANAM _ చంద్రప్రభ వాహనంపై రాజ దర్బార్ కృష్ణుడు అలంకరణలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

Tirupati/Appalayagunta, July 1, 2026: As part of the annual Brahmotsavams at Appalayagunta, Sri Prasanna Venkateswara Swamy blessed devotees on Chandraprabha Vahanam on Wednesday evening in the Raja Darbar Krishna adornment. Earlier, the Unjal Seva was performed at the temple.

The Rathotsavam will be held on Thursday, July 2, at 8.45 a.m.

TTD Deputy EO Sri Harindranath, AEO Sri Devarajulu, temple officials, priests, Srivari Sevaks and devotees participated in the Vahana Seva.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

చంద్రప్రభ వాహనంపై రాజ దర్బార్ కృష్ణుడు అలంకరణలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

తిరుపతి/ అప్పలాయగుంట, 2026, జూలై 01: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 07.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు చంద్రప్రభ వాహనంపై రాజ దర్బార్ కృష్ణుడు అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించారు.

సా. 5.00 – 05.30 గం.ల మధ్య ఊంజల్ మండపంలోకి శ్రీవారు వేంచేపు చేశారు. సా. 5.30 – 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహించారు.

జూలై 02  రథోత్సవం

జూలై 02న గురువారం ఉదయం 08.45 గం.లకు రథోత్సవం జరుగుతుంది.

వాహన సేవలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.