SRI PRASANNA VENKATESWARA SWAMY BLESSES DEVOTEES ON GARUDA VAHANAM _ గరుడవాహనంపై కలియుగ ప్రత్యక్ష దైవం దివ్యమంగళ విహారం
Tirupati, June 29, 2026: The Garuda Vahanam procession of Sri Prasanna Venkateswara Swamy was held with great spiritual fervour on Monday night as part of the annual Brahmotsavams at Appalayagunta.
Mounted on Garuda Vahanam, the Lord blessed a large gathering of devotees, who chanted “Govinda… Govinda…” and offered camphor harathi with devotion.
Earlier, Snapana Tirumanjanam and Unjal Seva were performed. On June 30, the Lord will bless devotees on Hanumantha Vahanam in the morning and Gaja Vahanam in the evening.
Nagari MLA Sri Gali Bhanu Prakash, TTD JEO Dr. A. Sarath, Deputy EO Sri Harindranath, VGO Sri Giridhar and other officials participated in the festivities.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
- filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (0.49136466, 0.282213);sceneMode: 2621440;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 50;
- filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (0.49136466, 0.282213);sceneMode: 2621440;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 50;
గరుడవాహనంపై కలియుగ ప్రత్యక్ష దైవం దివ్యమంగళ విహారం
గోవింద నామస్మరణల నడుమ భక్తులను కటాక్షించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
అప్పలాయగుంట బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక పారవశ్యం
తిరుపతి, 2026 జూన్ 29: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సోమవారం రాత్రి జరిగిన గరుడవాహన సేవ అపూర్వ భక్తి వైభవాన్ని సంతరించుకుంది. శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు గరుడవాహనంపై దివ్యమంగళ విహారం చేస్తూ భక్తులకు అభయప్రదానమిచ్చారు.
రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన గరుడవాహన సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని “గోవింద… గోవింద…” నామస్మరణలతో ఆలయ పరిసరాలను మార్మోగించారు. అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారి దివ్యరూపాన్ని దర్శించుకుని పరమానందాన్ని పొందారు.
అంతకుముందు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్ మండపానికి వేంచేపు, అనంతరం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు.
జూన్ 30న హనుమంత, గజవాహన సేవలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 30, మంగళవారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం గజవాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే శ్రీ గాలి భాను ప్రకాష్, టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, వీజీవో శ్రీ గిరిధర్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, అర్చకులు, శ్రీవారి సేవకులు, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










