SRI PURANDARADASA ARADHANA MAHOTSAVAM CONCLUDES _ ముగిసిన శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు
Tirumala, 10 February 2024: The three-day Sri Purandardasa Aradhana Mahatsavam in Tirumala came to a grand end on Saturday.
On this occasion, Suprabhatam, meditation, community bhajan, followed by a musical program, Haridasa Ranjani were held in Asthanamandapam.
More than 3,500 members of Bhajan Mandals from the states of Andhra Pradesh, Telangana, Karnataka and Tamil Nadu participated in this program under the direction of TTD Dasa Sahitya Project Special Officer Sri Ananda Theerthacharyulu.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ముగిసిన శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు
తిరుమల, 2024 ఫిబ్రవరి 10: తిరుమలలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి.
ఈ సందర్భంగా ఆస్థానమండపంలో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తనం, ఆ తరువాత హరిదాస రంజని కళాకారులతో సంగీత కార్యక్రమం నిర్వహించారు.
టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి 3,500 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.