PUSPANJALI TO THE STATUE OF SRI PURANDARADASA _ శ్రీ పురందరదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

Tirumala, 18 January 2026: As part of the Aradhana Mahotsavams of Sri Purandaradasa, the doyen of Dasa Sahitya, floral tributes were paid on Sunday morning to the statue of Sri Purandaradasa located at Alipiri in Tirupati.

Earlier, members of various Bhajana Mandalis rendered devotional songs as part of bhajana programmes.

TTD Dasa Sahitya Project Special Officer Sri P.R. Anandatheerthacharyulu, along with other officials and devotees, participated in the programme.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ పురందరదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

తిరుపతి, 2026 జనవరి 18: దాససాహిత్య పితామహుడు శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉద‌యం అలిపిరి వద్ద గల శ్రీ పురందరదాసుల విగ్రహనికి పలువురు ఘ‌నంగా పుష్పాంజలి ఘటించారు.

 ముందుగా భజనమండళ్ల సభ్యులు భ‌జ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు, ఇతర ఆధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.