SRI RAMA PATTABHISHEKAM ASTHANAM HELD _ శ్రీవారి ఆలయంలో శ్రీరామపట్టాభిషేకం

Tirumala, 3 Apr. 20: The coronation ceremony episode of Lord Sri Rama was held at Tirumala temple on Friday evening. 

The archakas rendered pattabhisheka ghattam from Ramayanam at Bangaru Vakili. 

Senior and Junior pontiffs of Tirumala and temple officials participated. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

శ్రీవారి ఆలయంలో  శ్రీరామపట్టాభిషేకం
       
తిరుమల, 2020 ఏప్రిల్ 03: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్ర‌వారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
        
ఉద‌యం శ్రీ సీతాల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ‌రాముల‌వారు, శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌ను రంగ‌నాయ‌కుల మండ‌పానికి వేంచేపు చేశారు. సాయంత్రం విశేష స‌మ‌ర్ప‌ణ చేప‌ట్టారు. రాత్రి 7.00 నుండి 8.00 గంటల వ‌ర‌కు బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని పట్టాభిషేక ఘట్టాన్ని పఠించిన‌ట్లు ఆల‌య అర్చ‌కులు తెలిపారు.
         
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.