SRI RAMA PATTABHISHEKAM PERFORMED GRANDLY AT SRI KODANDARAMA SWAMY TEMPLE _ శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం
Tirupati, March 29, 2026: Sri Rama Pattabhishekam was performed in a grand manner on Sunday night at the Sri Kodandarama Swamy Temple in Tirupati.
The day began with Suprabhatam, awakening the Lord, followed by Abhishekam to the Moolavarlu. At 8:00 AM, the Utsava deities were taken to the Unjal Mandapam. Later, Abhishekam was performed to Sri Kodandarama Swamy using the sacred water brought from Narasimha Teertham. From 9:00 AM to 11:00 AM, rituals including Agni Pratishta and Chaturdasa Kalasa Snapana Tirumanjanam were conducted in the Yagasala.
Sri Rama Pattabhishekam was performed ceremoniously from 7:00 PM onwards. From 8:30 PM to 9:30 PM, Sri Sita Rama Lakshmana on the Golden Tiruchi and Sri Anjaneya Swamy on a special Tiruchi will be taken in a grand procession along the four Mada Streets of the temple, blessing the devotees.
Temple Deputy EO Smt. Nagaratna, Temple Inspector Sri Suresh, other officials, and a large number of devotees participated in the event.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం
తిరుపతి, 2026 మార్చి 29: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఉత్సవమూర్తులను ఊంజల్ మండపానికి వేంచేపు చేశారు. అనంతరం నరసింహతీర్థం నుండి తెచ్చిన తీర్థంతో శ్రీకోదండరామునికి అభిషేకం చేశారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్ట, చతుర్దశ కలశస్నపన తిరుమంజనం నిర్వహించారు.
రాత్రి 7 గంటల నుండి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీఆంజనేయస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.







