SRI RAMAKRISHNA TIRTHA MUKKOTI AS A CELEBRATIONS _ వేడుకగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి
Tirumala, 12 February 2025: Sri Ramakrishna Theertha Mukkoti, one of the sacred torrents in Tirumala Seshachala Forest, was celebrated on Wednesday on the advent of full moon day of Magha month every year.
According to legends, Maharshi Sri Ramakrishna created this shrine with Tapobalam.
The religious staff started in a procession chanting mantras from Srivari temple and reached Sri Ramakrishna Thirtham at 11 am. The idols of Sri Ramachandra Murthy and Sri Krishna were specially anointed with milk, curd, sandalwood paste and other spices. Special pujas were performed and offerings were made.
Pongal, Upma, Sambar Rice, curd rice, Pulihora packets, drinking water and buttermilk packets were distributed by the Srivari Sevaks to the devotees at Papavinasanam Dam.
A medical camp was organized under the direction of the TTD medical department at the theertham and medicines were distributed to the devotees.
Under the direction of TTD Engineering and Forest Departments, walking tracks were arranged to make the devotees comfortable at many places along the way. A large number of devotees participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వేడుకగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి
తిరుమల, 2025 ఫిబ్రవరి 12: తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి బుధవారం వేడుకగా జరిగింది. ప్రతిఏటా మాఘ మాసంలో పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.
శ్రీవారి ఆలయం నుంచి అర్చక సిబ్బంది మంత్రోచ్ఛారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 11 గంటలకు శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణభగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు.
రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు పాపవినాశనం డ్యామ్ వద్ద పొంగలి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు. తీర్థం వద్ద టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటుచేసి భక్తులకు మందులు పంపిణీ చేశారు. టీటీడీ ఇంజినీరింగ్, అటవీ విభాగాల ఆధ్వర్యంలో మార్గమధ్యంలో పలుచోట్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా నడకమార్గాలు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.