SRI RAMANAVAMI UTSAVAMS IN KRT _ ఏప్రిల్ 6 నుండి 8వ తేదీ వరకు శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు
Tirupati, 05 April 2025: After annual Brahmotsavams, Sri Kodandarama temple in Tirupati is gearing up to observe Srirama Navami Utsavams from April 06 to 08.
On the auspicious festive day of Srirama Navami on April 06, there will be Abhishekam to Mula Virat.
On April 07, the celestial Sita Rama Kalyanam will be organized in a grand manner, while on April 08 Sri Rama Pattabhishekam ceremony will be performed.
From April 10-12, the annual Teppotsavams will be observed at Sri Ramachandra Pushkarini.
Every day in the morning, there will be Snapana Tirumanjanam to the Utsava deities and in the evening the float festival is observed.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఏప్రిల్ 6 నుండి 8వ తేదీ వరకు శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు
తిరుపతి, 2025 ఏప్రిల్ 05: తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 6 నుండి 8వ తేదీ వరకు శ్రీ రామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.
ఏప్రిల్ 6న శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం మూలవర్లకు అభిషేకం, ఉదయం 8 నుండి 9 గంటలకు శ్రీ సీత లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.
ఏప్రిల్ 7న శ్రీ సీతారాముల కల్యాణం :
ఏప్రిల్ 7వ తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టిటిడి పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఏప్రిల్ 8న శ్రీరామ పట్టాభిషేకం :
ఏప్రిల్ 8న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
ఏప్రిల్ 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు వసంతోత్సవం, ఆస్థానం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరుగనుంది.
ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు :
శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.