SRI RAMANUJACHARYA INITIATED SOCIAL CHANGE THROUGH SPIRITUALITY: SRI SRI SRI CHINNA JEEYAR SWAMY _ ఆధ్యాత్మికతతో సమాజ మార్పుకు శ్రీకారం చుట్టిన రామానుజాచార్యులు : శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి
SRI RAMANUJACHARYA AVATARA MAHOTSAVAMS BEGIN GRANDLY
Tirupati, April 20, 2026: Sri Sri Sri Chinna Jeeyar Swamy of Tirumala said that Sri Ramanujacharya conveyed the message that God belongs to everyone and that all people in society should live with a sense of equality.
Under the aegis of TTD’s Alwar Divya Prabandha Project, the Sri Ramanujacharya Avatar Mahotsavams commenced grandly on Monday evening at Annamacharya Kalamandiram in Tirupati. These celebrations will be held for three days till April 22.
Later, devotional songs rendered by the team of Sri Saraswati Prasad from Tirupati captivated the devotees.
Alwar Divya Prabandha Project Coordinator Sri Purushottam and devotees participated in the programme.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆధ్యాత్మికతతో సమాజ మార్పుకు శ్రీకారం చుట్టిన రామానుజాచార్యులు : శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి
శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఘనంగా ప్రారంభం
తిరుపతి, 2026 ఏప్రిల్ 20: భగవంతుడు అందరివాడని, సమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వ భావనతోజీవించాలనే సందేశాన్ని శ్రీ రామానుజాచార్యులు ఇచ్చారని తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామితెలిపారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్యకళామందిరంలో సోమవారం సాయంత్రం శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఘనంగాప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఏప్రిల్ 22 వరకు మూడు రోజుల పాటు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ, ఆదిశేషుని అవతారమైనరామానుజాచార్యులు శరణాగతి భక్తిని విస్తృతంగా ప్రచారం చేశారని చెప్పారు. శరణాగతి భావంతోభగవంతుని సేవించడం ద్వారా జీవితం సార్థకమవుతుందని వివరించారు.
అలాగే, ఆయన ప్రచారం చేసిన విశిష్టాద్వైత తత్వం భక్తి, జ్ఞానం, సేవ మార్గాలను కలిపి సమాజానికిదిశానిర్దేశం చేసిందన్నారు. రామానుజాచార్యుల బోధనలు నేటికీ ప్రజలకు మార్గదర్శకంగానిలుస్తున్నాయని తెలిపారు.
అనంతరం హైదరాబాద్‌కు చెందిన శ్రీ పరకాలన్ “శ్రీ రామానుజాచార్యులు – వైభవం” అంశంపైప్రసంగించారు. భక్తి ఉద్యమం ద్వారా సమాజ సంస్కరణకు శ్రీకారం చుట్టిన మహానుభావుడురామానుజాచార్యులని చెప్పారు. కులమత భేదాలకు అతీతంగా సమానత్వాన్ని ప్రోత్సహించినఆచార్యుడిగా ఆయన నిలిచారని వివరించారు.
తదుపరి తిరుపతికి చెందిన శ్రీ సరస్వతి ప్రసాద్ బృందం ఆలపించిన సంకీర్తనలు భక్తులనుఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం మరియు భక్తులుపాల్గొన్నారు.



