SRI SOUMYANATHA SWAMY BLESSES DEVOTEES IN KURMA AVATARAM _ సింహవాహనంపై యోగ నరసింహ స్వరూపంలో భక్తులకు అభయమిచ్చిన శ్రీ సౌమ్యనాథస్వామి

SPIRITUAL FERVOUR MARKS THE THIRD DAY OF NANDALUR BRAHMOTSAVAMS

Tirupati / Nandalur, July 24, 2026: On the third day of the annual Brahmotsavams at Sri Soumyanatha Swamy Temple, Nandalur, Lord Sri Soumyanatha Swamy appeared in the divine Yoga Narasimha adornment on Simha Vahanam on Friday night and blessed devotees.

The Simha Vahanam symbolises the Lord’s mission of protecting the righteous and destroying evil. Through this Vahana Seva, the Lord conveyed the message of upholding Dharma by eliminating ignorance and unrighteousness.

Kalpavruksha and Hanumantha Vahana Sevas on July 25

As part of the Brahmotsavams, the Lord will bless devotees on Kalpavruksha Vahanam on the morning of July 25 and on Hanumantha Vahanam on the same night.

TTD JEO Dr. A. Sharath, Temple Deputy EO Smt. A. Prasanthi, EE Smt. Sumathi, AEO Sri Ravi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Dileep, temple priests, officials, Srivari Sevaks and a large number of devotees participated in the Vahana Seva.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

సింహవాహనంపై యోగ నరసింహ స్వరూపంలో భక్తులకు అభయమిచ్చిన శ్రీ సౌమ్యనాథస్వామి

నందలూరు బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం

తిరుపతి / నందలూరు, 2026 జూలై 24: నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం రాత్రి స్వామివారు యోగ నరసింహ స్వరూపంలో సింహవాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అనుగ్రహించారు.

దుష్టశిక్షణ, శిష్టరక్షణకు ప్రతీకగా స్వామివారు సింహవాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించారు. అజ్ఞానం, అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని పరిరక్షించడంలో తాను, తన వాహనమైన సింహం సమానంగా కృషి చేస్తామనే సందేశాన్ని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అందించారు.

జూలై 25 కల్పవృక్ష, హనుమంత వాహనసేవలు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూలై 25న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనంపై శ్రీ సౌమ్యనాథస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ వాహనసేవలో టీటీడీ జేఈవో డా. ఏ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, ఈఈ శ్రీమతి సుమతి, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.