SRI SOUMYANATHA SWAMY BLESSES DEVOTEES ON ASWA VAHANAM IN KALKI ALANKARAM _ అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ సౌమ్యనాథ స్వామి అనుగ్రహం 

Tirupati / Nandaluru, July 29, 2026: As part of the annual Brahmotsavams at Sri Soumyanatha Swamy Temple, Nandaluru, Sri Soumyanatha Swamy graced devotees in Kalki Alankaram on Ashwa Vahanam on Wednesday night.

The Vahana Seva was held in a devotional atmosphere with traditional music, bhajans and kolatam performances. The Ashwa Vahanam signifies the Lord as the controller of the senses and conveys the message of overcoming the evils of Kali Yuga through devotion and chanting the Lord’s name.

Temple Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Dileep and a large number of devotees participated in the procession.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ సౌమ్యనాథ స్వామి అనుగ్రహం 

తిరుపతి / నందలూరు , 2026 జూలై 29: నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించారు. 

మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ  కోలాహలంగా వాహనసేవ జరిగింది.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.

వాహ‌న సేవ‌లో ఆల‌య సూప‌రింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ దిలీప్, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.