SRI SOUMYANATHA SWAMY BLESSES DEVOTEES ON GAJA VAHANAM _ గజ వాహనంపై సౌమ్యనాథ స్వామి కనువిందు
Tirupati, July 28, 2026: As part of the annual Brahmotsavams at Sri Soumyanatha Swamy Temple, Nandaluru, the deity was taken in a grand Gaja Vahanam procession on Tuesday evening, blessing devotees.
The elephant mount symbolizes Omkara, the Universe, and divine protection, reminding devotees to overcome ego and seek the Lord’s grace.
Temple AEO Sri Ravi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Rajesh, priests, officials, and a large number of devotees participated.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
గజ వాహనంపై సౌమ్యనాథ స్వామి కనువిందు
తిరుపతి, 2026 జూలై 28: నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటలకు స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సంగతి గుర్తు చేస్తుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

