SRI SOUMYANATHA SWAMY BLESSES DEVOTEES ON MATSYA AVATARAM _ తిరుచ్చిపై మత్స్యావతారంలో భక్తులను మంత్రముగ్ధులను చేసిన శ్రీ సౌమ్యనాథస్వామి

Tirupati / Nandalur: As part of the annual Brahmotsavams at Sri Soumyanatha Swamy Temple, Nandalur, Lord Sri Soumyanatha Swamy, accompanied by Sridevi and Bhudevi, gave darshan to devotees on Tiruchi in Matsya Avataram on the second day of the festivities on Thursday morning.

Depicting Lord Vishnu’s first incarnation, Matsya Avataram, the procession passed through the village streets amid continuous chanting of “Govinda”, traditional Chekka Bhajans, Kolatam, and auspicious musical performances, creating a deeply devotional atmosphere. Devotees offered Karpura Harati at various points and received the Lord’s blessings.

Temple Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Dileep, priests, officials, and a large number of devotees participated in the Vahana Seva.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

తిరుచ్చిపై మత్స్యావతారంలో భక్తులను మంత్రముగ్ధులను చేసిన శ్రీ సౌమ్యనాథస్వామి

తిరుపతి / నందలూరు: నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు గురువారం ఉదయం తిరుచ్చిపై మత్స్యావతారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామివారు గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చారు.

“విష్ణుమూర్తి ప్రథమావతారమైన మత్స్యావతార వైభవంలో” కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణ, చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన వాహనసేవ ఆధ్యాత్మిక పరవశాన్ని నింపింది. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.

ఈ వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.