SRI SOUMYANATHA SWAMY CHAKRASNANAM PERFORMED WITH RELIGIOUS FERVOUR _ అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి వైభవంగా పుష్పయాగ మహోత్సవం
ANNUAL BRAHMOTSAVAMS TO CONCLUDE WITH DHWAJAVAROAHANAM TONIGHT
Tirupati, July 30, 2026: The annual Brahmotsavams of Sri Soumyanatha Swamy Temple at Nandaluru concluded on a spiritual note with the ceremonial Chakrasnanam performed on Thursday morning as per Agama traditions. Priests, officials and a large number of devotees participated in the sacred ritual.
Earlier, the Pallaki Utsavam of Sri Soumyanatha Swamy along with Sridevi and Bhudevi was held from 7.30 am to 8.45 am. This was followed by the Snapana Tirumanjanam for the deities and Sri Sudarsana Chakrattalwar from 9.15 am to 10.15 am near the temple Pushkarini. The ritual included Vishwaksena Aradhana, Punyahavachanam, Rajopacharas and sacred abhishekam with milk, honey, coconut water, turmeric and sandalwood paste, as prescribed in the Vaikhanasa Agama. The Chakrasnanam was performed at 10.30 am.
During the ceremony, TTD Veda Parayanam scholars chanted the Upanishads, Pancha Suktams, Dasa Shanti Mantras and Divya Prabandham. The deities were beautifully adorned with special flower garlands.
The Chakrasnanam was performed for the welfare of the world, timely rains, good health, peace and prosperity of all devotees. According to the Agama scriptures, devotees who participate in the Brahmotsavams receive the divine blessings of Lord Srimannarayana.
Navasandhi and Mada Veedhi Utsavam will be held from 5.30 pm to 6.30 pm, followed by Dhwajavarohanam between 7.00 pm and 7.30 pm, marking the conclusion of the nine-day annual Brahmotsavams.
Temple AEO Sri Ravi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Dileep, priests, officials and a large number of devotees participated in the celebrations.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి వైభవంగా పుష్పయాగ మహోత్సవం
బ్రహ్మోత్సవాల్లో జరిగిన లోపాల పరిహారార్థం శాస్త్రోక్తంగా నిర్వహణ
తిరుపతి, 2026 జూలై 30: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
జూన్ 25 నుంచి జూలై 3 వరకు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిత్యకైంకర్యాలు, ఉత్సవాల సందర్భంగా అర్చకులు, అధికారులు, పరిచారకులు, భక్తుల వల్ల తెలియక జరిగిన లోపాల పరిహారార్థం ఆగమశాస్త్ర సంప్రదాయం ప్రకారం ఈ పుష్పయాగాన్ని నిర్వహించారు.
స్నపన తిరుమంజనం, పుష్పాల శోభాయాత్ర
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీటితో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పుష్పయాగానికి వినియోగించే పుష్పాలను మూలమూర్తి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి, ఆలయ ప్రదక్షిణతో పాటు మాడవీధుల్లో శోభాయాత్రగా తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వభూపాల వాహనంలో స్వామివారిని కొలువుదీర్చారు.
రెండున్నర టన్నుల పుష్పాలతో దివ్య పుష్పార్చన
మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సుమారు రెండున్నర టన్నుల పుష్పాలతో పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలతో సహా 18 రకాల పుష్పాలు, ఆరు రకాల పవిత్ర పత్రాలతో స్వామివారికి పుష్పార్చన నిర్వహించారు. ఆధ్యాత్మిక వైభవాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం వీధి ఉత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, ఏవీఎస్వో శ్రీహరి రావు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, కంకణభట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
