SRI SOUMYANATHA SWAMY KALYANOTSAVAM PERFORMED WITH GRANDEUR AT NANDALUR _ నందలూరులో వైభవంగా శ్రీ సౌమ్యనాథస్వామివారి కల్యాణోత్సవం

Tirupati / Nandalur, July 28, 2026: Divine celestial wedding of Sri Soumyanatha Swamy with Sridevi and Bhudevi conducted as per Agama traditions for the welfare of the world

The annual Brahmotsavams of Sri Soumyanatha Swamy at Nandalur witnessed the grand Kalyanotsavam of Sri Soumyanatha Swamy with Sridevi and Bhudevi on Tuesday morning, the seventh day of the festival. The sacred ceremony was performed amidst Vedic chanting and attracted a large number of devotees.

The Utsava deities were ceremoniously brought to the Kalyana Mandapam at 10 a.m. accompanied by traditional temple music. Priests then performed the rituals as per Agama traditions, including Vishvaksena Aradhana, Punyahavachanam, Kankana Dharana, Agni Pratishtha, Yajamana Sankalpam, Bhakta Sankalpam, Maha Sankalpam and Mangalasutra Dharana, amid the chanting of Vedic hymns.

The divine ceremony concluded with Nakshatra Harati and Mangala Harati. Devotees who witnessed the celestial wedding chanted “Govinda… Govinda…” and received the blessings of the divine couple.

Temple Deputy Executive Officer Smt. Prashanthi, AEO Sri Ravi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Rajesh, temple priests, officials, staff and a large number of devotees participated in the programme.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

నందలూరులో వైభవంగా శ్రీ సౌమ్యనాథస్వామివారి కల్యాణోత్సవం

శ్రీదేవి, భూదేవి సమేతంగా జగత్కళ్యాణం కోసం శాస్త్రోక్తంగా నిర్వహించిన కల్యాణ మహోత్సవం

తిరుపతి / నందలూరు, 2026 జూలై 28: నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామివారి దివ్య కల్యాణోత్సవం అత్యంత వైభవంగా, వేదఘోషల మధ్య ఘనంగా జరిగింది. స్వామివారి దివ్య కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

ఉదయం 10 గంటలకు ఉత్సవమూర్తులను కల్యాణ మండపానికి మంగళవాయిద్యాల నడుమ వేద పండితులు వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్ఠాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ తదితర శాస్త్రోక్త క్రతువులను అత్యంత వైదిక సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

అనంతరం నక్షత్రహారతి, మంగళహారతులతో దివ్య కల్యాణ మహోత్సవం ఘనంగా ముగిసింది.

స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా దర్శించిన భక్తులు “గోవింద… గోవింద…” నామస్మరణలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించి, స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, ఏఈఓ శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.