SRI SUNDARAJA SWAMY RIDES THE FLOAT _ రెండవ రోజు తెప్పపై విహరించిన శ్రీసుందరరాజ స్వామి

Tirupati, 08 June 2025: On the second day of the annual Teppotsavam at Sri Padmavathi Ammavari Temple, which fell on Sunday, Sri Sundararaja Swamy took three majestic rounds on the float in Padmasarovaram, blessing devotees.

The day began with Suprabhatam, followed by Sahasranama Archana and Nitya Archana. From 3 PM to 4.30 PM, a grand abhishekam was performed using milk, curd, honey, sandal, and aromatic substances.

At 6.30 PM, the deities were brought to Padma Pushkarini, and the float festival took place from 6.30 to 7.15 PM. Later, Swamy was taken on a procession along the four Mada streets.

Deputy EO Sri Harindranath, AEO Sri Devarajulu, Superintendent Sri Ramesh, Temple Inspectors Sri Chalapathi, other officials, priests, Srivari Sevaks, and a large number of devotees participated.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

రెండవ రోజు తెప్పపై విహరించిన శ్రీసుందరరాజ స్వామి

తిరుపతి, 2025 జూన్ 08: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండవరోజు ఆదివారం పద్మసరోవరంలో శ్రీ సుందరరాజ స్వామి వారు తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 03.00 నుండి 4.30 గంటల వరకు స్వామి వారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 6.30 గంటలకు ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.15 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ సుందరరాజ స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.