SRI VARAHASWAMY JAYANTHI ON SEP 1_ సెప్టెంబరు 1న శ్రీ వరాహస్వామి జయంతి

Tirumala, 27 Aug. 19: TTD proposes to organize the unique festival of Sri Varaha Jayanti at the Sri Varahaswamy temple on September 1.

According to Agama traditions, the first puja and first offering on Tirumala is always for Sri Varahaswami ahead of any rituals and offerings for Lord Venkateswara.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబరు 1న శ్రీ వరాహస్వామి జయంతి

ఆగ‌స్టు 27, తిరుమల 2019: ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 1న వరాహ జయంతి ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యహవచనం చేస్తారు. ఆ త‌రువాత పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారుచేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో అగమ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీవరాహస్వామి జయంతిని టిటిడి ఘనంగా నిర్వహిస్తోంది. స్థలమహత్యం ప్రకారం తిరుమలలో తొలి పూజ, తొలి నివేదన శ్రీ వరాహస్వామివారికే చేస్తారు. భక్తులు ముందుగా శ్రీభూవరాహస్వామివారిని, ఆ తరువాత శ్రీవారిని దర్శించుకోవడం ఆచారం. శ్రీ మహావిష్ణువు లోక కల్యాణం కోసం శ్రీ వరాహస్వామివారి అవతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.