SRI VEDANARAYANA SWAMY ON KALPAVRUKSHA VAHANAM _ కల్పవృక్ష వాహనంపై పాండురంగ స్వామి అలంకారంలో శ్రీ వేదనారాయణ స్వామి అనుగ్రహం
Tirupati, May 04, 2026: On the fourth day of the Brahmotsavams at Nagalapuram, Sri Vedanarayana Swamy blessed devotees on Monday morning on the Kalpavruksha Vahanam in Panduranga Swamy Alankaram.
Amid bhajans, kolatams, and mangala vadyams, the procession was held in a grand manner. Devotees offered harathi and had darshan with devotion.
Kalpavruksha is believed to fulfill wishes and grant peace and contentment to devotees.
Temple officials, priests, and a large number of devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కల్పవృక్ష వాహనంపై పాండురంగ స్వామి అలంకారంలో శ్రీ వేదనారాయణ స్వామి అనుగ్రహం
తిరుపతి, 2026 మే 04: నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై పాండురంగ స్వామి అలంకారంలో స్వామివారు భక్తులను అనుగ్రహించారు.
వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
కల్పవృక్షం కోరుకున్న వరాలను ప్రసాదించే దివ్య వృక్షంగా పరిగణించబడుతుంది. దాని నీడలో ఆశ్రయించిన వారికి శాంతి, సంతృప్తి కలుగుతాయని ఆధ్యాత్మిక భావన.
ఈ వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శ్రీనివాసులు, శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




