SRI VEDANARAYANA SWAMY ON MUTHYAPU PANDIRI VAHANAM _ ముత్యపు పందిరి వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ వేదనారాయణ స్వామి దర్శనం
Tirupati, May 03, 2026: On the third day of the Brahmotsavams at Nagalapuram, Sri Vedanarayana Swamy graced devotees on Sunday night on the Mutyapu Pandiri Vahanam in Rajamannar Alankaram.
Amid devotional chants, bhajans, and mangala vadyams, the procession was held in a grand manner. Devotees offered harathi and had darshan of the Lord with great devotion.
The pearl decorations added spiritual charm, symbolizing peace and divine bliss.
Temple Superintendent Sri Srinivasulu Reddy, Inspectors, priests, and a large number of devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ముత్యపు పందిరి వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ వేదనారాయణ స్వామి దర్శనం
తిరుపతి, 2026 మే 03 నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం రాత్రి ముత్యపు పందిరి వాహనంపై రాజమన్నార్ అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
స్వామివారికి అలంకరించిన ముత్యాలహారాలు శాంతి, ప్రశాంతతను ప్రసాదిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించాయి.
ఈ వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శ్రీనివాసులు, శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


