SRI VEDANARAYANA SWAMY PUSHPA YAGAM HELD IN GRANDEUR _ వైభవంగా శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి పుష్పయాగం

Tirupati, June 05, 2026: The annual Pushpayagam of Sri Vedanarayana Swamy was conducted with religious fervour at Nagalapuram Temple on Friday. Following Snapana Tirumanjanam to the utsava deities in the morning, the Pushpayagam was performed amid Vedic chanting and mangala vadyams.

The deities were worshipped with a variety of flowers and sacred leaves as devotees immersed themselves in Govinda Nama Sankeertana. Temple priests said the ritual is performed as an atonement for any inadvertent lapses during temple festivals and daily rituals and is believed to remove all doshas.

A large number of devotees participated in the sacred event.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి పుష్పయాగం

  గోవింద నామ స్మ‌ర‌ణ‌తో భక్తుల తన్మయత్వం

తిరుపతి, 2026 జూన్ 05: నాగ‌లాపురం శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి ఆలయంలో శుక్ర‌వారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది.  

ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేద నారాయ‌ణస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.

మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు ఆలయంలోని రాములవారి మండపంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, రోజా, తామర, కలువ, మొగలిరేకులు వంటి 10 రకాల పూలు, 3 రకాల ఆకులతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు.  ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.

బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

పుష్పయాగం అనంతరం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీ‌నివాసులు రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.