SRI VENKATESWARA APANNA HRIDAYA SCHEME FOR CHILDREN HEART OPERATIONS _ శ్రీ వేంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్ దాతలకు ప్రయోజనాలు
Tirupati, 27 March 2022: TTD has opened gates for yet another novel scheme Sri Venkateswara Apanna Hridaya Scheme aimed at to raise funds through donors to meet expenses of free heart surgeries of newborn and children conducted under the Sri Venkateswara Pranadana Trust.
In order to provide several benefits to the donors of the scheme, TTD has framed certain guidelines.
For donors who contributed ₹1 crore for the construction of Sri Padmavati Children’s super-speciality hospital, already beneficiaries are accorded under the SV Pranadana Trust. Similarly, TTD has special privileges for donors of ₹1 crore and above for the purchase of medical equipment and also hospital construction.
Since SV Pranadana a trust has also been registered for CSR (Corporate Social Responsibility), corporate donors could now contribute for the purchase of medical equipment under CSR funding and avail all benefits-eligible for normal devotees as per the lifetime of the equipment or 10 years whichever is applicable.
Another opportunity is made possible for the donation of operation expenses for one or more children including newborn where in the contribution is spent only for the cost of surgeries.
By publishing the name of the donor for said operation and providing moral satisfaction to donors. Presently it costs ₹1 lakh for medicine, oxygenators, surgery equipment and implants which any single donor, society, corporate could bequeath.
Under the SV Apanna Hridaya scheme a donor of ₹1 lakh could avail of one-time VIP break tickets for five persons.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ వేంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్ దాతలకు ప్రయోజనాలు
తిరుమల, 2022 మార్చి 27: శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిలో నవజాత శిశువులు, చిన్నపిల్లలకు శస్త్రచికిత్సలకు అవసరమయ్యే ఖర్చును విరాళంగా అందించే దాతలకు ప్రయోజనాలు కల్పించాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకోసం మార్గదర్శకాలను రూపొందించింది.
టిటిడి తలపెట్టిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.1 కోటి విరాళం అందించే దాతలకు ఆ మేరకు ఎస్వీ ప్రాణదాన ట్రస్టు ద్వారా ఇప్పటికే అమలుచేస్తున్న ప్రయోజనాలు వర్తిస్థాయి. అదేవిధంగా ఆసుప్రతి భవన నిర్మాణానికి గానీ లేదా వైద్యయంత్రాల కొనుగోలుకు గానీ రూ.1 కోటి పైన విరాళం అందించే వారిని ప్రత్యేక దాతలుగా గుర్తించి ప్రత్యేక ప్రయోజనాలను టిటిడి కల్పించనుంది.
కాగా, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు సిఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి) రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. కావున ఆసుపత్రికి అవసరమైన వైద్య యంత్రాలను సమకూర్చేందుకు దాతలు సిఎస్ఆర్ నిధులను కూడా విరాళంగా ఇవ్వొచ్చు. సాధారణ దాతలకు కల్పించే ప్రయోజనాలన్నీ వీరికి వర్తిస్థాయి. అయితే వైద్యయంత్రాల జీవితకాలంగా భావించే 10 సంవత్సరాల వరకే ఈ ప్రయోజనాలు ఉంటాయి.
ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది చిన్నారులకు లేదా నవజాత శిశువులకు శస్త్రచికిత్సలకు అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చేందుకు దాతలకు మరో అవకాశం కల్పించడమైనది. ఈ విరాళం మొత్తాన్ని నిర్దేశించిన శస్త్రచికిత్సలకు మాత్రమే వ్యయం చేస్తారు. ఈ విధంగా విరాళం ఇచ్చిన దాతల పేర్లను ఆసుపత్రిలో ప్రదర్శిస్తారు. తద్వారా దాతలకు ఎంతో ఆత్మసంతృప్తి కలిగినట్లవుతుంది. ప్రస్తుతం ఒక చిన్నారికి గుండె శస్త్రచికిత్స చేసేందుకు మందులు, ఆక్సిజనేటర్లు, శస్త్రచికిత్స సామగ్రి, ఇంప్లాట్స్ కలిపి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. శ్రీ వేంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్ ద్వారా దాతలు ఈ ఖర్చును విరాళంగా అందించవచ్చు. ఏవైనా సంస్థలు, కార్పొరేట్లు, ట్రస్టులు కూడా ఈ విరాళం అందించవచ్చు. అయితే, ఈ విధంగా ఒక లక్ష రూపాయలు విరాళం అందించే దాతలకు ఈ స్కీమ్ ద్వారా ఐదుగురికి మించకుండా పేమెంట్‌పై బ్రేక్ దర్శన టికెట్లు కేటాయిస్తారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.