SRI VENKATESWARA SWAMY PROCESSION ON HAMSA VAHANAM AT THONDAMANPURAM _ తొండమాన్ పురంలో హంస వాహనంపై ఊరేగిన శ్రీ వేంకటేశ్వరస్వామి

Tirupati, 17 February 2026: The annual Brahmotsavams at Sri Venkateswara Swamy Temple, Thondamanpuram are in marching ahead in full  religious spirit.

The festivities commenced on February 16 and will conclude on February 24. As part of the celebrations, Vahana Sevas are being conducted from 7 pm to 8.30 pm.

On Tuesday, marking the second day of the Brahmotsavams, Sri Venkateswara Swamy along with Sridevi and Bhudevi was taken in a majestic procession on Hamsa Vahanam.

Upcoming Schedule:

February 18 – Simha Vahanam

February 19 – Hanumantha Vahanam

February 20 – Kalyanotsavam at 5.00 pm; Garuda Vahanam in the night

February 21 – Gaja Vahanam

February 22 – Chandraprabha Vahanam

February 23 – Tiruchi in the morning; Aswa Vahanam in the night

On February 24, Chakra Snanam will be performed from 9.30 am to 11.30 am, followed by

Dhwajavarohanam from 6.30 pm to 8pm.

On February 25, Pushpayagam will be held at 5.30 pm.

In connection with the Brahmotsavams, cultural programmes are being organized ahead of the Vahana Sevas, enhancing the spiritual fervour of the celebrations.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

తొండమాన్ పురంలో హంస వాహనంపై ఊరేగిన శ్రీ వేంకటేశ్వర స్వామి

తిరుపతి, 2026, ఫిబ్రవరి 17: తొండమాన్‌పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగుతున్నాయి. ఈ నెల  16వ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ వరకు జరుగనున్నాయి.  ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జ‌రుగ‌నున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రెండోవ రోజు శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారు హంస వాహనంపై ఊరేగారు.

ఫిబ్ర‌వ‌రి 18న సింహ వాహనం, ఫిబ్ర‌వ‌రి 19న హనుమంత వాహనం, ఫిబ్ర‌వ‌రి 20న సాయంత్రం 5 గంట‌ల‌కు కల్యాణోత్సవం, రాత్రి గరుడ వాహన సేవ అత్యంత వైభ‌వంగా సాగనున్నాయి. ఫిబ్ర‌వ‌రి 21న గజవాహనం, ఫిబ్ర‌వ‌రి 22న చంద్రప్రభ వాహనం, ఫిబ్ర‌వ‌రి 23న ఉదయం తిరుచ్చి, రాత్రి అశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు.

ఫిబ్ర‌వ‌రి 24న ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు. ఫిబ్ర‌వ‌రి 25న సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం జరగనుంది.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వాహన సేవల ముందు ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.