SRI VENUGOPALA SWAMY APPEARS AS YOGA NARAYANA ON SIMHA VAHANAM _ సింహవాహనంపై యోగనారాయణుడిగా దివ్య దర్శనమిచ్చిన శ్రీ వేణుగోపాలస్వామి

Tirupati, June 08, 2026: As part of the annual Brahmotsavams at Sri Venugopala Swamy Temple, Karvetinagaram, Lord Sri Venugopala Swamy, accompanied by Sri Rukmini and Satyabhama, blessed devotees on Monday morning in the divine attire of Yoga Narayana atop Simha Vahanam.

The Simha Vahanam symbolizes courage, strength, and unwavering devotion. Devotees thronged the temple and participated in the Vahana Seva amid continuous chants of “Govinda”.

Temple officials, priests, and a large number of devotees attended the event.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సింహవాహనంపై యోగనారాయణుడిగా దివ్య దర్శనమిచ్చిన శ్రీ వేణుగోపాలస్వామి

సింహబల సమాన భక్తిబలానికి ప్రతీకగా వాహనసేవ

గోవింద నామస్మరణలతో మారుమోగిన కార్వేటినగరం

తిరుపతి, 2026 జూన్ 08 : కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణిసత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన సోమవారం ఉదయం స్వామివారు శ్రీ యోగనారాయణుడి అలంకారంలో సింహవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు.

యోగశాస్త్రంలో సింహం వాహనశక్తికిధైర్యానికిశీఘ్రగమనానికి ప్రతీకగా భావిస్తారుభక్తుడు సింహబలం వంటి అచంచలమైన భక్తిశ్రద్ధలను కలిగి ఉన్నప్పుడే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడవుతాడని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయిఅలాగే స్వామివారు రాక్షసుల హృదయాలలో సింహస్వరూపుడిగా ప్రత్యక్షమవుతారని స్తోత్రవాఙ్మయం కీర్తిస్తోంది.

 సందర్భంగా జరిగిన వాహనసేవలో సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డిటెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులుఆలయ అర్చకులుఅధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించి పరవశించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.