SRI VENUGOPALA SWAMY BLESSES DEVOTEES ON SURYAPRABHA VAHANAM _ సూర్యప్రభపై తేజోమయంగా భక్తులను కటాక్షించిన శ్రీ వేణుగోపాలస్వామి
Tirupati, June 12, 2026: As part of the annual Brahmotsavams of Sri Rukmini and Satyabhama Sametha Sri Venugopala Swamy at Karvetinagaram, the Lord graced devotees on Surya Prabha Vahanam on Friday morning.
Devotees offered Harathis and participated in the procession with devotion.
The Surya Prabha Seva symbolized the divine radiance of Surya, the source of life and energy. Sri Venugopala Swamy will bless devotees on Chandra Prabha Vahanam at 7.30 p.m. on Friday.
The grand Rathotsavam will be held on June 13 at 7.30 a.m., followed by Aswa Vahanam Seva at 7 p.m.
Temple officials, priests, and a large number of devotees participated in the Vahana Seva.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సూర్యప్రభపై తేజోమయంగా భక్తులను కటాక్షించిన శ్రీ వేణుగోపాలస్వామి
బ్రహ్మోత్సవ వైభవంతో భక్తి పారవశ్యంలో మునిగిన కార్వేటినగరం
తిరుపతి, 2026 జూన్ 12: కార్వేటినగరం శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై దివ్యంగా విహరించి భక్తులకు అభయానుగ్రహాలు ప్రసాదించారు. గ్రామ వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగగా, భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు.
జగత్తుకు చైతన్యప్రదాత సూర్యనారాయణుని మహిమ
సూర్యుడు తేజోనిధి, సకల జీవరాశులకు ప్రాణాధారం. వర్షాలు, పంటలు, ఔషధాలు, ప్రకృతిలోని సమస్త చైతన్యానికి మూలకారణమైన సూర్యతేజస్సుకు ప్రతీకగా స్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమివ్వడం విశేష ఆధ్యాత్మిక సందేశాన్ని అందించింది.
రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారి అనుగ్రహం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 7.30 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
జూన్ 13న రథోత్సవం
వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం ఉదయం 7.30 గంటలకు శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రథంపై గ్రామ వీధుల్లో విహరించి స్వామివారు భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
అదే రోజు రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


