SRIDEVI ,BHUDEVI SAMETHA SRI MALAYAPPA SWAMI RIDES ON BANGARU TIRUCHI _ బంగారు తిరుచ్చిపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

Tirumala, 24 Oct 20: On the final day of Srivari Navaratri Brahmotsavam,Saturday evening ,Sri Malayappa swami along with his consorts Sridevi and Bhudevi blessed devotees on Bangaru Tiruchi.

The nine days Brahmotsavam held in ekantham  inside Srivari temple due to Covid-19 restrictions concluded with the Procession of Sri Malayappa swamy entourage on the Bangaru Tiruchi vahanam along the Vimana prakaram and Asthanam at Ranganayakula Mandapam.

TTD EO Dr KS Jawahar Reddy ,Additional EO Sri V Dharma Reddy ,TTD board member Sri DP Ananth and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు

బంగారు తిరుచ్చిపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

తిరుమల, 2020 అక్టోబ‌రు 24: న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శ‌ని‌వారం రాత్రి 7 గంటలకు శ్రీ‌వారి ఆల‌యంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు బంగారు తిరుచ్చిపై ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ సంద‌ర్భంగా స్వామి, అమ్మ‌వార్ల‌ను విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వ‌హించారు. అనంత‌రం రంగనాయ‌కుల మండ‌పంలో వేంచేపు చేశారు. ఈ ఉత్స‌వంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు సభ్యుడు శ్రీ అనంత ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.