SRIKAKULAM ORPHANS GET SRIVARI DARSHAN- THANKS TTD CHAIRMAN _ అనాధలకు శ్రీవారి దర్శనం
Tirumala, 05 March 2022: TTD Chairman Sri YV Subba Reddy has facilitated 35 orphans of Vavilla Valasa village of Srikakulam district with a devotional trip to Tirumala, Kanipakam, Tiruchanoor, Srikalahasti and Golden temple of Vellore.
On the request of a resident of Vavilla Valasa village, Sri Paluru Siddharth, the TTD Chairman on March 3 put into action a plan to bring the orphans from their village to Tirumala by train, provided transportation through a private bus from Renigunta with a personal contribution of ₹50,000. The Chairman organised hospitality of accommodation and Anna Prasadam at Tirumala and Srivari Darshan on Friday.
On Saturday the orphan children were taken for Darshan at the Golden Temple of Vellore in Tamilnadu, besides Kanipaka Vinayaka, Sri Padmavati at Tiruchanoor and Sri Kalahastiswara temples.
The orphans expressed their happiness and gratitude for the lifetime opportunity of Srivari Darshan besides that of others made possible by the TTD Chairman and thanked him wholeheartedly.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
అనాధలకు శ్రీవారి దర్శనం- టీటీడీ చైర్మన్ కు కృతజ్ఞతలు
తిరుమల 5 మార్చి 2022: టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పెద్దమనసు చేసుకొని సొంత ఖర్చులతో 35 మంది అనాధలకు శ్రీవారి దర్శనంతో పాటు గోల్డన్ టెంపుల్, కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తి ఆలయాల దర్శనం కల్పించారు.
శ్రీకాకుళం జిల్లాలోని వావిళ్ళ వలస గ్రామంలో నివాసం ఉంటున్న పాలూరు సిద్ధార్థ్ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కలిసి అనాధలు కి దర్శనం కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన ఆయన 35 మంది అనాధలకు 50,000 రూపాయలు రైల్వే టికెట్ లకు డబ్బులు ఇచ్చారు. రేణిగుంట లో రైలు దిగిన వారికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి, ఈ నెల 3వ తేదీన తిరుమలకు తీసుకొచ్చారు. తిరుమలలో ఆయన సొంత ఖర్చులతో అద్దె గదులను భోజన వసతులను ఏర్పాటు చేశారు. శుక్రవారం వారికి సంతృప్తి కరంగా స్వామివారి సర్వదర్శనం చేయించారు. శనివారం గోల్డన్ టెంపుల్ , కాణిపాకం, తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేయించారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని ఎన్నో సంవత్సరాలుగా ఆశ పడుతున్న తమకు మానవతా హృదయముతో టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చేసిన ఈ సేవ ఎప్పటికీ మరువలేమని వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.