SRINIVASA KALYANAM HELD _ ఎన్.ఎమ్.కండ్రిగలో శ్రీనివాస కల్యాణం
Tirupati, 21 Jan. 21: The celestial Srinivasa Kalyanam was held with the religious fervour in N M Kandriga in Tada mandalam of Sri Potti Sreeramulu Nellore District on Thursday evening.
On an experimental basis, TTD organised the divine marriage fete almost after a span of ten months following Covid norms.
JEO H&E Smt Sada Bhargavi, Srinivasa Kalyanam Project Special Officer Sri Satya Gopal, Superintendent Sri Siva Kumar were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఎన్.ఎమ్.కండ్రిగలో శ్రీనివాస కల్యాణం
తిరుపతి, 2021 జనవరి 21: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం ఎన్.ఎమ్.కండ్రిగ హరిజనవాడలో టిటిడి నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం సాయంత్రం వైభవంగా శ్రీనివాస కల్యాణం జరిగింది. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీనివాస కల్యాణం నిర్వహించారు.
కోవిడ్ – 19 నేపథ్యంలో దాదాపు 10 నెలల తరువాత కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయోగాత్మకంగా శ్రీ శ్రీనివాస కల్యాణంను టిటిడి నిర్వహించింది.
శ్రీనివాస కల్యాణంలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అంకురారోపణ, రక్షాబంధనం – కంకణధారణ, అగ్నిప్రతిష్ట, మధుపర్కం, మహాసంకల్పం – గోత్రనామాలు చెప్పుకోవడం, కన్యాదానం, మాంగళ్యధారణ, హోమాలు, పూలమాలలు మార్చుకోవడం, అక్షతారోపణం, నీరాజనం ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జెఈవో(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి, కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ గోపాల్, సూపరిండెంట్ శ్రీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.